డైరెక్టర్ విక్రమ్ పై ఒత్తిడి తెస్తున్న నాగార్జున!
Published on Oct 3, 2017 1:21 pm IST


విక్రమ్ కె కుమార్ దర్శకత్వం అఖిల్ హీరో గా హలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అయితే ఈ సినిమాని అక్టోబర్ 15 లోపు పూర్తి చేయాలని కింగ్ నాగార్జున విక్రమ్ పై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. నిజానికి ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ చైతు -సమంత పెళ్లి సంబరాల్లో ఉన్నారు. ఈ పెళ్లి రెండు రోజుల్లో తేలిపోయిన తర్వాత రిసెప్షన్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రిసెప్షన్ ద్రుష్టిలో ఉంచుకొని సినిమాని తొందరగా పూర్తి చేయాలని విక్రమ్ కి చెబుతున్నట్లు సమాచారం. అయితే హలో సినిమా చివరికి వచ్చేసిందని. వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేసే పనిలో డైరెక్టర్ ఉన్నట్లు తెలుస్తుంది.

 
Like us on Facebook