కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటున్న ఎన్టీఆర్ !
Published on Feb 20, 2018 2:49 pm IST

తారక్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాలో కొత్త మేకోవర్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మేకోవర్ కేవలం స్టైల్ పరంగా మాత్రమే కాదు శారీరకంగా కూడ. త్రివిక్రమ్ రాసిన పాత్రలో ఇప్పుడున్న బరువు కంటే ఇంకొంత తగ్గి స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్లో ఎన్టీఆర్ కనిపించాల్సి ఉంది.

ఇందుకోసం ఆయన స్పెషల్ గా ట్రైనర్ లాయ్డ్ స్టీవెన్స్ ను అపాయింట్ చేసుకుని మరీ కసరత్తులు మొదలుపెట్టారు. ఎన్టీఆర్ జిమ్ లో చేస్తున్న వర్కవుట్స్ కు సంబంధించి స్టీవెన్స్ ఒక వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ కసరత్తులతో పాటే తారక్ కోసం స్పెషల్ డైట్ ను డిజైన్ చేశారట. సినిమా పూర్తయ్యే వరకు తారక్ ఆ ఆహార నియమాలనే పాటిస్తారట.

మరి తారక్ ఇంత కష్టపడి పట్టుదలతో ట్రై చేస్తున్న కొత్త లుక్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. త్వరలో రెగ్యులర్ షూట్ కు వెళ్లనున్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

 
Like us on Facebook