‘రాజరథం’ కొత్త విడుదల తేది !

నిరూప్ భండారి, అవంతిక శెట్టి, ఆర్య, రవి శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా ‘రాజరథం’. కన్నడతో పాటు తెలుగులో ఈ సినిమా మర్చి 23న విడుదలకానుంది. ముందుగా ఈ సినిమాను జనవరిలో విడుదల చేద్దాం అనుకున్నారు. కాని కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా వాయిదా పడింది. అనూప్ భండారి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కన్నడలో ఈ డైరెక్టర్ కు మంచి పేరుంది.

రూ. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్య ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల రానా విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ కథలో బస్సు పాత్ర కోసం రానా వాయిస్ ఓవర్ ఇచ్చాడట. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.