మోహన్ బాబుతో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ “దక్ష”

మోహన్ బాబుతో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ “దక్ష”

Published on Mar 19, 2025 8:05 AM IST

daksha

మన టాలీవుడ్ సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ నుంచి చాలా మంది తమ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తన పిల్లలు కూడా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపగా తన కూతురు శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఆసక్తికరమైన మెడికల్-సైకలాజికల్ థ్రిల్లర్ “దక్ష”ని ఈరోజు అనౌన్స్ చేశారు.

ఈ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేయగా ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక చిత్రంలో మోహన్ బాబు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అలాగే తనతో పాటుగా మంచు లక్ష్మీ ప్రసన్న, మార్కో స్టార్ సిద్ధిక్, సముద్రఖని, విశ్వంత్, చిత్రా శుక్లా, మహేష్, వీరేన్ తంబిదొరై తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు మున్ముందు రానున్నాయి.

తాజా వార్తలు