సినిమాలో పాట పాడిన మోహన్ బాబు !

28th, January 2018 - 12:05:18 PM

డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలు రూపొందిన చిత్రం ‘గాయత్రి’. మోహన్ బాబు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. ఈ చిత్రం కోసం మోహన్ బాబు డైలాగ్స్ చెప్పడం మాత్రమే కాకుండా పాట కూడా పాడారు. ఈ చిత్రంలో ‘అండ పిండ బ్రహ్మాండ.. అనే సాంగ్ ఉంది.

భారీ వ్యయంతో సెట్టింగ్స్ వేసి రూపొందించిన పాటను ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ తో కలిసి పాడారట మోహన్ బాబు. ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ ఈ పాటకు లిరిక్స్ అందించారు. యకపోతే ఈ చిత్ర ఆడియో ఈరోజూ 28వ తేదీన రిలీజ్ కానుంది. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని మధన్ డైరెక్ట్ చేయగా థమన్ సంగీతాన్ని అందించారు.