‘మోహన్ బాబు’ ఇంట్లో విషాదం !

Published on Sep 20, 2018 9:49 am IST

తెలుగు తెర విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. మోహన్‌ బాబు మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో కన్నుమూశారు. మంచు లక్ష్మమ్మగారి వయస్సు 85 సంవత్సరాలు. తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌ లో ఆమె తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం మంచు మోహన్‌బాబుతో సహా మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా విదేశి పర్యటనలో ఉన్నారు. కాగా లక్ష్మమ్మ మృతి సంగతి తెలిసిన వెంటనే వారు తిరుపతికి బయలుదేరారు. మంచు లక్ష్మమ్మగారి అంత్యక్రియలు తిరుపతిలో జరుతాయని మంచు ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నారు.

సంబంధిత సమాచారం :