మెగాస్టార్ సెట్లో ఇకపై అలాంటివి కుదరవు

Published on Feb 26, 2020 6:59 am IST

పెద్ద సినిమాలకు లీకుల బాధ తగ్గడం లేదు. జాగ్రత్తలు తీసుకున్నా కీలకమైన విషయాలు కొన్ని ప్రమేయం లేకుండా బయటకు వెళ్ళిపోతుండటం అందరికీ తలనొప్పిగా మారింది. గతంలో ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ సినిమాలు ఈ ఇబ్బందినే ఎదుర్కోగా ఇప్పుడు అది మెగాస్టార్ చిరు వంతైంది. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు టీమ్.

కానీ నిన్న సినిమాలో చిరు లుక్ ఎలా ఉంటుందో లీకైపోయింది. షూటింగ్ సమయంలో మొబైల్ ద్వారా చాలా దగ్గర్నుండి తీయబడిన ఈ వీడియోతో చిరు మెకోవర్ స్పష్టంగా తెలిసిపోయింది. ఈ పరిణామంతో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానుల్ని సప్రైజ్ చేయాలనుకున్న మేకర్స్ ఆలోచనలకు గండి పడినట్లైంది. ఈ పరిణామంతో ఖంగుతిన్న కొరటాల అండ్ టీమ్ ఇకపై సెట్లో మొబైల్స్, ల్యాప్ టాప్స్ లాంటి గ్యాడ్జెట్స్ అనుమతించరాదని కండిషన్ పెట్టుకున్నారట.

సంబంధిత సమాచారం :