“RRR”..పార్టీ సరే అసలు క్లారిటీ ఎప్పుడో..?

“RRR”..పార్టీ సరే అసలు క్లారిటీ ఎప్పుడో..?

Published on Aug 19, 2021 7:02 AM IST


ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలతో ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తాజా చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం విడుదల కోసం చాలా ఆసక్తిగా అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవలే ఉక్రెయిన్ దేశానికి కీలక షెడ్యూల్ నిమిత్తం వెళ్లిన మేకర్స్ దానిని విజయవంతంగా కంప్లీట్ చేసేసి పార్టీ కూడా చేసుకున్నారు. మరి ఇది సరే అసలు మ్యాటర్ ఏమిటీ అన్నది ప్రశ్నగా మారింది.

అదే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో.. మేకర్స్ వైపు నుంచి అయితే లాస్ట్ దోస్తీ సాంగ్ వరకు కూడా అక్టోబర్ 13నే రిలీజ్ అని క్లారిటీగా ఉన్నారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో మాత్రం ఈ చిత్రం ససేమిరా ఆ సమయానికి రాదు వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది అని ఒక లెక్కలో ఊదరగొడుతున్నాయి. దీనితో ఈ చిత్రం విడుదల తేదీపై మరింత ఉత్సుకత నెలకొంది. మరి ఈ పార్టీలు అన్నీ పక్కన ఉంచితే అసలు దీనిపై ఒక తుది క్లారిటీ నెమ్మదిగా అయినా ఎప్పుడు ఇస్తారో అన్నది చూడాలి..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు