త్వరలో ‘నీది నాది ఒకే కథ’ మోషన్ పోస్టర్ !
Published on Dec 6, 2017 10:24 am IST

శ్రీ విష్ణు హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నీది నాది ఒకే కథ’. ప‌లు సినిమాల‌కు మాట‌లు రాసిన వేణు ఉడుగుల ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. ఫ్యామిలీ, యూత్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బొబ్బిలి సురేష్ సంగీతాన్ని స‌మ‌కూర్చుతున్నాడు. గౌతంరాజు, మార్తాండ్ కె వెంకటేష్ వంటి సినియర్ ఎడిటర్స్ దగ్గర పనిచేసిన బొంతల నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమాతో ఎడిటర్ గా పరిచయం కాబోతున్నారు.

ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ప్రీ లుక్ కు మంచి స్పందన లభించింది. ఈ నెల 8న మోషన్ పోస్టర్ విడుదల చెయ్యనున్నారు చిత్ర యూనిట్. ‘మెంటల్ మదిలో’ సినిమాతో మంచి సక్సెస్ లో ఉన్న శ్రీ విష్ణు నుండి రాబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంభందించి మరిన్ని విషయాలు త్వరలో మీడియాతో పంచుకోనున్నారు మూవీ టీమ్.

 
Like us on Facebook