“దేవర” షూట్ పై లేటెస్ట్ అప్డేట్..

“దేవర” షూట్ పై లేటెస్ట్ అప్డేట్..

Published on May 4, 2024 7:04 AM IST

పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికి తెలిసిందే. మరి దీనిపై ఎన్నో అంచనాలు ఉండగా ఈ మే లో అయితే అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం షూట్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఇప్పుడు వరకు భారీ చిత్రం వార్ 2 లో తారక్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మేకర్స్ దేవర షూట్ ని విశాఖపట్నం లో ప్లాన్ చేస్తున్నారట.

అయితే ఈ షూట్ అంతా ఎన్టీఆర్ లేకుండా తీసే సన్నివేశాలు అన్నట్లు తెలుస్తోంది. ఇవి సేఫ్ సైడ్ గా తీస్తున్నట్లు సమాచారం. ఇక ఈ భారీ చిత్రంలో విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు అలాగే అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మాణం వహిస్తుండగా ఈ అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు