పోస్టర్ ని కూడా పడనీయం.. సినిమాని ఆపేస్తాము !

పోస్టర్ ని కూడా పడనీయం.. సినిమాని ఆపేస్తాము !

Published on Nov 12, 2018 3:00 PM IST

విజయవాడలో నివసించిన లారా అనే వ్యక్తి జీవితం ఆధారంగా నిర్మించిన ‘రంగు’ సినిమా పై అభ్యతరాలు ఉన్నాయని ‘లారా’ కుటుంబ సభ్యులు ఫిల్మ్ ఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

దిలీప్ (లారా బావ మరిది) : ఏడాది క్రితం లారా (పవన్ కుమార్) గురించి విజయవాడలో సమాచారం సేకరించడానికి చిత్ర దర్శకుడు కార్తికేయ వచ్చాడు. అప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు. పది రోజుల క్రితం సినిమా ట్రైలర్, ప్రెస్ మీట్ చూసాము. లారా అనే రౌడీ షీటర్ అనే వాయిస్ తో ట్రైలర్ మొదలు అయ్యింది. లారా మీద రౌడీ షీట్ అన్యాయంగా తెరిచారు. ఇప్పుడు ఆయన పిల్లలు చదుకు కుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే వాళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఆలోచించండి. ఇప్పుడు ఆ సినిమా ముందు మాకు చూపించాలని డిమాండ్ చేస్తున్నాం. మా అంగీకారంతోనే సినిమా రిలీజ్ చేయాలి. లేదంటే సినిమా రిలీజ్ ని లీగల్ గా అడ్డుకుంటాం. విజయవాడలో పోస్టర్ కూడా పడనీయం.
లారా గురించి వీరికి అసలు ఏం తెలుసు అని ప్రశ్నిస్తున్నాం ?

సందీప్ మాట్లాడుతూ ( లారా స్నేహితుడు ) : విజయవాడ అంటే సినిమా దర్శకులకు రౌడీ షీటర్స్ మాత్రమే గుర్తుకు వస్తారా ? లారా మీద సినిమా వస్తుంది అనగానే దర్సకుడి నెంబర్ తీసుకొని మాట్లాడాము. ఆయన చూద్దాం అని తర్వాత మా కాల్ కి రెస్పాన్స్ అవడం లేదు. వ్యక్తుల జీవితాల పై సినిమా చేసేటప్పుడు వారి కుటుంబం నుండి అనుమతి తీసుకోవాలి. నిర్మాత గాని, దర్శకుడు కానీ ఆ పని చేయలేదు. మేము ముందుగా సినిమా చూడాలి…మాకు అభ్యతరాలు ఉంటే సినిమాను ఆపేస్తాము.. మాకు సినిమా చూపించకుండా రిలీజ్ చేస్తే లీగల్ గా కోర్ట్ కి వెళతాం. ఇంకా ఎంత దూరం అయినా వెళతాం’. అన్నారు.

రంగు సినిమా ఈ నెల 23 న విడుదలకు సిద్ధం అవుతుంది. మరి ఈ వివాదాన్ని ‘రంగు’ చిత్రబృందం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు