సంక్రాంతికి విడుదలకానున్న స్టార్ హీరో సినిమా !
Published on Jun 28, 2018 2:35 pm IST

తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న నూతన చిత్రం ‘విశ్వాసం’ 40 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది. మొదటగా ఈ దీపావళి కానుకగా విడుదలవుతుందనుకున్న ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా వచ్చే ఏడాది పండగ బరిలో నిలవనుంది.

శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ హాస్య నటులు కోవై సరళ , వివేక్ , యోగి బాబు , తంబీ రామయ్య మొదలగు వారు నటిస్తున్నారు. ఇక వివేగం చిత్రం తరువాత శివ , అజిత్ కలయికలో వస్తున్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి .

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook