భారీ యాక్షన్ సీక్వెన్స్ లో మహేష్ బాబు !
Published on Nov 28, 2016 11:37 pm IST

mahesh
మహేష్ బాబు – మురుగదాస్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం అహ్మదాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే హైదరాబాద్, చెన్నైలలో రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. గుజరాత్ లో ఎంచుకున్న ప్రత్యేకమైన లొకేషన్లలో ఈ చూట్ జరుగుతోంది. మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయట. వాటిలో ఒకదాన్ని ప్రస్తుతం అహ్మదాబాద్లోనే షూట్ చేస్తున్నారు.

ఈ యాక్షన్ సీక్వెన్సులో అబ్బురపరిచే ఛేజింగ్ సన్నివేయాలు ఉంటాయని, సినిమా మొత్తానికి ఇవి హైలెట్ గా నిలిచే యాక్షన్ ఎపిసోడ్లలో ఇది కూడా ఒకటని తెలుస్తోంది. ఈ సన్నివేశాలన్నీ ప్రముఖ ఫైట్ కంపోజర్ పీటర్ హెయిన్స్ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఈ షెడ్యూల్ డిసెంబర్ 23 వరకూ జరగనుంది. ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మందులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలోరకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్. జె సూర్య విలన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.

 
Like us on Facebook