మహేష్ సినిమా టీజర్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్న మురుగదాస్
Published on Aug 30, 2016 2:32 pm IST

murugudas
సౌత్ ఇండియా టాప్ దర్శకుల్లో ఒకరైన మురుగదాస్, మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సుమారు రూ. 80 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మురుగదాస్ అంటేనే ఫస్ట్ లుక్ నుండి సినిమా వరకూ అన్నీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. అందుకే ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా తాలూకు టీజర్ ను పక్కాగా ప్లాన్ చేస్తున్నారు మురుగదాస్.

ప్రస్తుతం అకీరా సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఆయన అది పూర్తవగానే చెన్నైలో మహేష్ సినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెడతారు. అదే సమయంలో టీజర్ ను కూడా విడుదల చేస్తారు. అందుకే ఈ షెడ్యూల్లోనే టీజర్ కోసం ఒక పూర్తి రోజును కేటాయించి షూటింగ్ జరుపుతారట. ఈ టీజర్ చాలా ప్రత్యేకంగా ఉంటూ మహేష్ స్టార్ డమ్ కు తగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే మురుగదాస్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని మరీ టీజర్ ను రెడీ చేయబోతున్నారట.

 
Like us on Facebook