అజిత్ సినిమాకు సంగీత దర్శకుడు ఖరారు !

అజిత్, శివ కాంబినేషన్లో తెర‌కెక్కిన‌ సినిమాలు ‘వీరమ్, వేదాళం , వివేగం’. వీటిలో మొదటి రెండు సినిమాలు మంచి విజయాలుగా నిలిచాయి. మరోసారి వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ‘విశ్వాసం’. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం మేరకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ డి.ఇమాన్ ఈ మూవీ కి వర్క్ చెయ్యబోతున్నాడని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 22 నుండి సెట్స్ మీదకు వెళ్ళబోతోంది.

ఈ సినిమాలో అజిత్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఒక పాత్రలో అజిత్ డాన్‌గా క‌నిపించ‌బోతున్నాడని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలింస్ ఈ సినిమాను నిర్మించబోతోంది. గ‌తంలో అజిత్‌, న‌య‌న‌తార క‌లిసి ‘ఆరంభం, బిల్లా’ సినిమాల్లో నటించారు. మూడోసారి వీరిద్దరు కలిసి నటిస్తుండడం విశేషం.