ఇంట‌ర్వ్యూ : కాలభైరవ – ‘మత్తు వదలరా’ చూసి చాల థ్రిల్ ఫీల్ అయ్యాను

ఇంట‌ర్వ్యూ : కాలభైరవ – ‘మత్తు వదలరా’ చూసి చాల థ్రిల్ ఫీల్ అయ్యాను

Published on Dec 24, 2019 3:32 PM IST

సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘మత్తు వదలరా’. కాగా రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ సినిమాకి కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కాలభైరవ విలేకర్లతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

సినిమా అవుట్ ఫుట్ ఫై బాగా నమ్మకంగా ఉన్నారు ?

అవును అండి. నా మొదటి సినిమాకి నేను పూర్తి న్యాయం చేసాననే నమ్మకంగా ఉంది. పైగా సినిమా చాల బాగా వచ్చింది. పర్సనల్ గా నాకు బాగా నచ్చింది, మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను.

చివరి నిముషంలో ఈ సినిమా యూనిట్ లోకి వచ్చారట ?

సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయంలో లాస్ట్ మినిట్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా నేను ఎంటర్ అయ్యాను. ఈ సినిమా నిర్మాత చెర్రీగారు నాకు అవకాశం ఇచ్చారు.

ఈ సినిమాలో సాంగ్స్ లేవు కదా. అది విన్నప్పుడు మీకు ఏమనిపించింది ?

నేను దాని గురించి అసలు ఆలోచించలేదండి. నిజానికి కథ విన్నప్పుడు అసలు ఈ సినిమాకి సాంగ్స్ అవసరం లేదు అనిపించింది. అందుకే పాటలు లేవు కదా అనే ఫీలింగ్ కలగలేదు. ఒకవేళ ఎంత మంచి పాట పెట్టినా అది కథకు ఉపయోగపడదు.

ఈ సినిమాకి మీరు అందించిన నేపథ్య సంగీతం పై మీకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చింది ?

చాల మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇప్పటికే సినిమా చూసిన వాళ్ళంతా మ్యూజిక్ చాల బాగుంది అన్నారు. పాటలు లేకపోయినా నేపథ్య సంగీతం మాత్రం సినిమా మొత్తం ఉంటుంది. అది ప్రేక్షుకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది అనుకుంటున్నాను.

మీరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ ని ఎక్కువ ఫాలో అవుతారు, ఎవర్ని ఎక్కువ ఇష్టపడతారు ?

అందర్నీ ఇష్టపడతాను. ప్రత్యేకంగా ఒక్కరు అని ఇష్టం అని ఏమి లేదు. అయితే చిన్నప్పటి నుండి నేను నాన్నగారి దగ్గరే పని చేశాను కాబట్టి ఆయనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అలాగే మణిశర్మగారు, తమన్ కూడా ఇష్టమే.

మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు కీరవాణిగారి ప్రభావం మీ పై ఎంతవరకూ ఉంటుంది ?

నా పై నాన్నగారి ప్రభావం చాల ఉంది. ఆయన దగ్గరే పని చేయడంతో.. ఆయన వర్కింగ్ స్టైలే నేను తెలియకుండానే ఫాలో అవుతాను. డైరెక్టర్ ఇంకో ట్యూన్ అడిగినప్పుడు వాళ్లకు నచ్చే విధంగా ఎలా చెయ్యాలి. ఒక ట్యూన్ ను ఎన్ని రకాలుగా ఆలోచించాలి. ఇవ్వన్నీ ఆయన నుండే నేర్చుకున్నాను.

కీరవాణిగారి దగ్గర కాకుండా వేరే ఎవరి దగ్గరైనా మ్యూజిక్ నేర్చుకున్నారా ?

ప్రత్యేకంగా మ్యూజిక్ ఏం నేర్చుకోలేదు. నాన్నగారి దగ్గర పని చేయడమే.

మీకు ఎలాంటి మ్యూజిక్ ఇష్టం. భవిష్యత్తులో మీరు ఎటువంటి మ్యూజిక్ ను అందించాలి అనుకుంటున్నారు ?

ఒకే రకమైన మ్యూజిక్ కాకుండా నా నుండి అన్ని రకాల మ్యూజిక్ రావాలని ఆశ పడుతున్నాను.

ఈ సినిమా మొదటిసారి చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ?

నేను ఒక్కరోజు కూడా షూటింగ్ కి వెళ్ళలేదు. షూటింగ్ మొత్తం అయిపొయిందని రఫ్ కటింగ్ చేసి ఆర్ఆర్ కోసం నాకు కాపీ పంపించారు. సినిమా ఎలా ఉందో వీళ్ళు ఎలా తీశారో అని సినిమా పెట్టుకుని ఒక ఆడియన్ లా నేను సినిమాని చూశాను. ఎక్కడా పాజ్ కూడా లేకుండా సినిమా మొత్తం చూశాను. చాల థ్రిల్ ఫీల్ అయ్యాను. ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అవుతారనే నమ్మకం వుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు