ఆగని లీక్స్ పై ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మాత సీరియస్!

Published on Aug 17, 2021 8:00 am IST


ఇటీవల కాలంలో మన టాలీవుడ్ సినిమా దగ్గర పలు భారీ చిత్రాల నుంచి అనేక లీక్ ల సమస్యలు ఇబ్బందులు పెట్టిన సంగతి తెలిసిందే. అది కూడా ఒకే చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అవన్నీ రావడం గమనార్హం. అదే మన టాలీవుడ్ లో అనతి కాలంలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ గా మారి బడా చిత్రాలను అందిస్తున్న నిర్మాణ సంస్థ “మైత్రి మూవీ మేకర్స్”. వీరి బ్యానర్ నుంచి ఒకదాన్ని మించి ఒకటి భారీ హిట్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మరికొన్ని తెరకెక్కుతున్నాయి.

మరి వాటిలో మహేష్ “సర్కారు వారి పాట” అల్లు అర్జున్ “పుష్ప” చిత్రాల నుంచి ఊహించని రీతి లీక్స్ బయటకి వచ్చేసి ఇబ్బంది పెట్టాయి. ఇప్పటికీ కూడా కొన్ని వచ్చేస్తున్నా నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పెట్టె విధంగా ఈ బ్యానర్ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ చాలా సీరియస్ గా స్పందించారు. ఈ లీక్స్ అన్నీ తమని చాలా ఇబ్బంది పెట్టాయని దీనిపై తాము చాలా సీరియస్ గా ఉన్నామని నిందితుడు ఎవరైనా సరే పట్టుకొని తీరుతాం అని దీనిపై ఆల్రెడీ సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేశామని ఖచ్చితంగా దీనిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని తెలిపారు.

సంబంధిత సమాచారం :