‘రొమాంటిక్’ నుండి ‘నా వల్ల కాదే’ !

Published on Jan 24, 2020 5:05 pm IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న తాజా సినిమా ‘రొమాంటిక్’. కాగా నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి తాజాగా ‘నా వల్ల కాదే’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. హీరో, హీరోయిన్ ను తలుచుకొని పాడుకునే ఈ ప్రేమ విరహ గీతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. భాస్కర్ భట్ల తన శైలి క్యాచీ పదాలతో రాసిన ఈ సాంగ్ ను సంగీత దర్శకుడు సునీల్ కష్యప్ చక్కగా తీర్చిదిద్దారు.

ఇక ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. గత చిత్రం ‘మెహబూబా’ సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు ఆకాష పూరి.

పూరి జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే యేడాది వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆకాష పూరికి జోడీగా కేతిక శర్మ నటిస్తోంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :

X
More