‘నా పేరు సూర్య’ ఫస్ట్ ఇంపాక్ట్ సాలిడ్ గా పడింది !

అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య’. నా ఇల్లు ఇండియా అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం దేశభక్తి నైపథ్యంలో రూపొందిన సినిమా కావడం విశేషం. అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫిస్ట్ ఇంపాక్ట్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. టీజర్ రూపంలో ఉన్న ఈ ఇంపాక్ట్ బలంగానే ఉంది. టీజర్లో అల్లు అర్జున్ ఫుల్ ఎనర్జిటిక్ గా, కొత్త తరహా లుక్ లో కోపం కంట్రోల్ చేసుకోలేని సోల్జర్ గా చాలా బాగా సెట్టయ్యాడు.

ఇక ‘బార్డర్ కెళ్ళి చచ్చిపోతాను, నీకు సూర్య అంటే సోల్జర్ కానీ బయటి ప్రపంచానికి యాంగర్’ వంటి డైలాగ్స్ భలేగా కనెక్టయ్యాయి. వాటికి తోడు విశాల్, శేఖర్ ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుండటంతో ఇంపాక్ట్ బాగా కుదిరి సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేసింది. లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో నాగబాబు సమర్పిస్తున్న ఈ చిత్రంలో బన్నీకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా బోమన్ ఇరానీ, అర్జున్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జనవరి 4 నుండి కొత్త షెడ్యూల్ మొదలుపెట్టుకోనున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నారు.

ఫస్ట్ ఇంపాక్ట్ కొరకు క్లిక్ చేయండి :