‘నా పేరు సూర్య’ మలయాళ ఫస్ట్ ఇంపాక్ట్ కు సూపర్ రెస్పాన్స్ !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా భారీ క్రేజ్ ఉంది. ముఖ్యంగా కేరళలో అయితే బన్నీని ప్రేమగా మల్లు స్టార్ అని పిలుచుకుంటారు. ఆయన నటించిన సినిమాల్ని విపరీతంగా ఆదరిస్తుంటారు అక్కడి యువత. అందుకే ఆయన సినిమాల్ని నిర్మాతలు మలయాళంలోకి కూడా తప్పక అనువదిస్తూ ఉంటారు. ఆయన తాజా చిత్రం ‘నా పేరు సూర్య’ని కూడా మలయాళంలో ‘ఎంటె పేరు సూర్య ఎంటె వీడు ఇండియా’ పేరుతో తెలుగుతో పాటే భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.

చిత్రం యొక్క ఫస్ట్ ఇంపాక్ట్ యొక్క మలయాళం వెర్షన్ ను నిన్న రిలీజ్ చేశారు. దీనికి తెలుగులో ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో కేరళ ప్రేక్షకుల నుండి కూడా అదే స్థాయి ఫీడ్ బ్యాక్ లభించింది. రచయిత వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నారు.

మలయాళ ఫస్ట్ ఇంపాక్ట్ కొరకు క్లిక్ చేయండి