కొత్త సినిమాను మొదలుపెట్టనున్న అల్లు అర్జున్ !
Published on Aug 2, 2017 8:31 am IST


ఇటీవలే ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏమాత్రం ఆలస్యం లేకుండా తన కొత్త ప్రాజెక్ట్ ‘నా పేరు సూర్య’ ను మొదలుపెట్టనున్నాడు. ఈరోజు నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

దృశభక్తి నైపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో బన్నీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఒక ఆర్మీ అధికారిగా కనిపించనున్నాడు. ఈ పాత్రలో పర్ఫెక్షన్ కోసం ఫిజికల్ గా ఫిట్ గా ఉండేందుకు బన్నీ యూఎస్ ట్రైనర్ల వద్ద హైదరాబాద్లోనే నెలరోజుల పాటు కఠినమైన శిక్షణ తీసుకోనుండటం విశేషం. 2018 సంక్రాంతికి విడుదలకానున్న ఈ సినిమాకు విశాల్ – శేఖర్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ సినిమాటోగ్రఫర్ రాజీవ్ రవి కెమెరా వర్క్ చేయనున్నారు

 
Like us on Facebook