-12 డిగ్రీల్లో షూటింగ్ చేస్తున్న అల్లు అర్జున్ !

-12 డిగ్రీల్లో షూటింగ్ చేస్తున్న అల్లు అర్జున్ !

Published on Feb 4, 2018 4:08 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ కోసం తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు. ఫస్ట్ ఇంపాక్ట్ కు వచ్చిన స్పందనను ద్వారా సినిమాపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాల్ని గమనించిన అయన బెటర్ ఔట్ ఫుట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దేశ సరిహద్దుల్లోని మంచి ప్రాంతాల్లో జరుగుతోంది. సుమారు -12 డిగ్రీల క్లిష్టమైన పరిస్థితుల్లో చిత్రీకరణ జరుపుతున్నారు.

వాతావరణం అనుకూలించకపోయినా సహజత్వం కోసం షూట్లో పాల్గొంటున్నారట బన్నీ. మరి ఈ సన్నివేశాలు స్క్రీన్ మీద ఏ స్థాయిలో ఉంటాయో చూడాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాను వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తుండగా విశాల్, శేఖర్ లు సంగీతాన్ని అందిస్తున్నారు.

తాజా వార్తలు