ఎమోషనల్ జర్నీగా ఉండనున్న ‘నా పేరు సూర్య’!

బన్ని నటిస్తోన్న ‘నా పేరు సూర్య’ సినిమా ఏప్రిల్ 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అను ఇమ్మానుల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి ఆదరణ లభించింది. దేశం కోసం పరితపించే ఆవేశపరుడైన సైనికుడిగా అల్లు అర్జున్ ఇందులో కనిపించబోతున్నాడు.

బన్ని గత సినిమాల్లోలాగా ఈ సినిమాకు పాటలు, ఫైట్స్ ఎక్కువ ఉండవని, సినిమా అంతా ఒక ఎమోషనల్ జర్నీలా ఉంటుందని చిత్ర సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. బలమైన స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ను థ్రిల్ చేసే సన్నివేశాలు ఈ సినిమాలో ఎక్కువగా ఉండబోతున్నాయి. సోషల్ కంటెంట్ కు కమర్షియల్ అంశాలని జతచేసి చేసి దర్శకుడు వక్కంతం వంశీ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.