బన్ని ‘నా పేరు సూర్య’ షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..!
Published on Jun 14, 2017 11:17 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డీజే చిత్రం జూన్ 23 న విడులవుతున్న విషయం తెలిసిందే. కాగా బన్ని తన కొత్త చిత్రాన్ని నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ నాపేరు సూర్య’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. నా ఇల్లు ఇండియా అనేది ఉప శీర్షిక. ఈ మేరకు టైటిల్ లోగోని కూడా విడుదల చేశారు.

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో అర్జున్ ముఖ్య పాత్రని పోషించనున్నారు. తమిళ నటుడు శరత్ కుమార్ విలన్ గా నటించనుండడం విశేషం. దేశభక్తి కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. విశాల్ – శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. జులై చివరి వారంలో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది.

 
Like us on Facebook