నవరస నుండి మరో మెలోడీ సిద్దం!

Published on Jul 18, 2021 10:31 pm IST

మణిరత్నం క్రియేషన్ లో వస్తున్న నవరస వెబ్ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం నవరసాలను తొమ్మిది ఎపిసొడ్ లుగా చిత్రించడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ నవరస ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ నుండి మరొక మెలోడీ విడుదల కి సిద్దం గా ఉంది. సూర్య నటించిన గిటార్ కాంబి మేల్ నిండ్రు నుండి నానుమ్ అనే పాటను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ పాటను రేపు సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. గౌతం మీనన్ దర్శకత్వం వహించిన ఈ ఎపిసొడ్ కు సింగర్ కార్తీక్ మదన్ లు సంయుక్తంగా పని చేశారు.

సంబంధిత సమాచారం :