మరోసారి పవర్‌ ఫుల్‌ అత్తగా కనిపించనున్న సీనియర్ హీరోయిన్ !

Published on Oct 8, 2018 9:17 am IST

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం తమిళంలోకి రీమేక్ అవ్వబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ తమిళ వర్షన్ చిత్రం సుందర్ సి దర్శకత్వంలో శింబు హీరోగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

కాగా, తాజాగా కోలీవుడ్ సినీవర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవలే అత్త పాత్రలో నటించిన రమ్యకృష్ణ మరోసారి అత్త పాత్రలో నటిస్తున్నారు. ‘అత్తారింటికి దారేది’ రీమేక్ లో శింబు అత్త పాత్రను రమ్యకృష్ణ పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శింబు సరసన మేఘా ఆకాశ్, కేథరీన్‌ థెరీసా హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌ లో జరుగుతోంది.

సంబంధిత సమాచారం :