అఖిల్ సినిమా ఫై క్లారిటీ ఇచ్చిన నాగ్ !

Published on May 31, 2018 10:52 am IST

అక్కినేని నాగార్జున రామ్ గోపాల్ వర్మ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘ఆఫీసర్’. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్బంగా సినిమా ప్రమోషనల్లో భాగంగా మాట్లాడిన నాగార్జునను విలేకర్లు రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో అఖిల్ నటించనున్నాడని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి ఇది నిజమేనా అని అడిగిన ప్రశ్నకు నాగార్జున తనదైన స్టైల్లో జవాబిచ్చారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి వర్మ, అఖిల్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. నేనైతే ఈ సినిమాపై ట్వీట్ చేయలేదుగా అని నాగ్ వివరించారు. దీన్ని బట్టి చూస్తే అఖిల్ వర్మల సినిమా చర్చల దశలో ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం అఖిల్ ‘తొలిప్రేమ’ డైరెక్టర్ వెంకీ అట్లూరి సినిమాలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :