మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో పునిత్ రాజ్ కుమార్ లు హీరోలుగా నటించిన ‘మైత్రి’ సినిమా ఫిబ్రవరిలో కన్నడంలో రిలీజ్ అయ్యి ఘన విజయం సాదించింది. బాల నేరస్థుల జీవితాన్ని బేస్ చేసుకొని తీసిన ఈ సినిమాలో సమాజానికి కావాల్సిన ఓ మేసేజ ఉంటూనే పక్కా కమర్షియల్ గా సినిమాని తీసారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా తెలుగు రీమేక్ లో నాగార్జున నటిస్తాడని అంటున్నారు. కానీ ఆ వార్తలని నాగార్జున కొట్టి పారేయడమే కాకుండా ఆ సినిమా రీమేక్ లో నటించడం లేదని తెలిపాడు.
నాగార్జున ప్రసతుతం తను చేస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా షూటింగ్ కర్నాటకలోని మైసూర్ లో జరుగుతోంది. అదే టైంలో నాగార్జున ఈ సినిమాని చూసారు. ఈ సినిమాలో చూపించిన సోషల్ మెసేజ్ నాగార్జునకి బాగా నచ్చింది. కానీ ప్రస్తుతానికయితే ఆయన సినిమా చేయడం లేదని తెలిపారు. దాంతో ఈ సినిమా మరే హీరో చేతికి వెళుతుందా అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇది కాకుండా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున – కార్తీ – శృతి హాసన్ కలిసి నటించనున్న సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.


