మార్చి నెలాఖరుకల్లా పూర్తికానున్న నాగార్జున సినిమా !
Published on Feb 14, 2018 3:00 pm IST

సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షెడ్యూల్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో హెవీ యాక్షన్, ఛేజింగ్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. మార్చి 30 వరకు ఈ షెడ్యూల్ జరగనుంది.

దీంతో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తికానుందట. ‘శపథం, గన్ అండ్ సిస్టమ్’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాలో నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. వేసవిలో విడుదలకానున్న ఈ చిత్రంలో మైరా సరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్ కంపెనీ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

 
Like us on Facebook