లేటెస్ట్..కింగ్ నాగ్ థ్రిల్లర్ ఓటిటిలో వచ్చేసింది.!

Published on Apr 22, 2021 8:00 am IST

గత ఏడాది లాక్ డౌన్ మూలాన చాలానే సినిమాలు నేరుగా డిజిటల్ గా రిలీజ్ కాబడిన విషయం మనం చూసాము. మరి అలా ఓటిటిలో ఆల్ మోస్ట్ ఫిక్స్ అయిన చిత్రాల్లో లాస్ట్ మినిట్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చినవి కూడా కొన్ని ఉన్నాయి. మరి అలాంటి వాటిలో కింగ్ నాగార్జున మరియు దర్శకుడు అహిషోర్ సాలొమోన్ కాంబోలో వచ్చిన గ్రిప్పింగ్ థ్రిల్లర్ చిత్రం “వైల్డ్ డాగ్” కూడా ఒకటి.

మన దేశంలో జరిగినటువంటి బిగ్గెస్ట్ అండర్ కవర్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెలలోనే థియేటర్స్ లో విడుదల అయ్యింది. అయితే టాక్ బాగానే వచ్చినా ఓవరాల్ గా గట్టెక్కలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ చిత్రం ఈరోజే దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, మళయాలం కన్నడ భాషల్లో కూడా నెట్ ఫ్లిక్స్ అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తుంది. మరి ఒకవేళ అప్పుడు థియేటర్స్ లో మిస్సయిన వారికి ఈ థ్రిల్లర్ ఇప్పుడు మంచి ట్రీట్ ఇవ్వొచ్చు..

సంబంధిత సమాచారం :