ఓటిటిలో అదరగొడుతున్న నాగ్ “వైల్డ్ డాగ్”.!

Published on Apr 25, 2021 3:33 pm IST

కింగ్ నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వైల్డ్ డాగ్”. దర్శకుడు అహిషోర్ సాలొమోన్ దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్ చిత్రం ఇది. నిజ జీవితంలో అందులోని మన దేశంలో జరిగిన అతి పెద్ద అండర్ కవర్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 2న విడుదల అయ్యింది.

అయితే థియేట్రికల్ అనుకున్న అనుకున్న టార్గెట్ అందుకోలేకపోయినా మంచి టాక్ తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాకు ముందే ఓటిటిలో చాలానే ఆఫర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలా నెట్ ఫ్లిక్స్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. కానీ మొదట థియేటర్స్ లోనే విడుదల చేసి తర్వాత రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసేసారు.

అన్ని ముఖ్య భాషల్లో విడుదల చేసిన ఈ చిత్రం ఇండియాలో ట్రెండింగ్ కు వచ్చింది. కానీ ఇపుడు ఇంటర్నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతూ ఉండడం విశేషం. యూఎస్, యూకే సహా మరిన్ని ప్రధాన దేశాలలో కూడా ఈ చిత్రం ట్రెండ్ అవుతూ ఉండడం గమనార్హం. మొత్తానికి ఓటిటిలో మాత్రం నాగ్ సినిమా అదరగొడుతుందనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :