“లాల్ సింగ్ చద్దా” నుండి చైతూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!

Published on Jul 20, 2022 7:30 pm IST

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా ఈ ఏడాది ఆగస్ట్ 11, 2022 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లోకి రానుంది. అద్వైత్ చందన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, వయాకామ్ 18 స్టూడియోస్ మరియు అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్‌ను సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తే, తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్స్ పంపిణీని నిర్వహిస్తోంది.

ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య బాలరాజు అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. మేకర్స్ ఈరోజు నాగ చైతన్య ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. చిరునవ్వుతో ఆర్మీ దుస్తులలో చైతూ చాలా అందంగా కనిపిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్, రామ్ చరణ్ లకు అమీర్ ఖాన్ స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించారు. కరీనా కపూర్ ఖాన్ మరియు మోనా సింగ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కొన్ని వారాల క్రితం, అమీర్ ఖాన్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 3 నిమిషాల నిడివి గల ట్రైలర్ లాల్ సింగ్ చద్దా, చిత్ర కథానాయకుడి మనోహరమైన మరియు అమాయక ప్రపంచంలోకి తీసుకు వెళ్ళింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :