సమంత, నాగ చైతన్యలు కలిసి నటించనున్నారా ?

11th, February 2018 - 12:29:49 PM

పెళ్లితో ఒకటైన ప్రేమ జంట సమంత, నాగ చైతన్యలు మరోసారి కలిసి నటించనున్నారని టీ-టౌన్లో బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య చేస్తున్న సినిమాలోనే సమంత నటించాల్సి ఉండగా అది కుదరలేదు. కానీ చైతూ దగ్గరకొచ్చిన తాజా ప్రాజెక్టులో వీరిద్దరూ కలిసి నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ ఈ మధ్య చైతన్యకు ఒక స్క్రిప్ట్ వినిపించాడట. చైతూకి కూడ అది నచ్చి పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ తయారుచేయమని చెప్పాడట. ఈ స్క్రిప్ట్ గనుక బాగా వస్తే అందులో కలిసి నటించాలని సమంత, చైతూలు భావిస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఈసారైనా సాధ్యమవుతుందో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టాల్సిందే.