నాగ చైతన్య కొత్త సినిమాకు ముహూర్తం కుదిరింది !
Published on Nov 24, 2017 1:42 pm IST

నాగ చైతన్య తన పెళ్లి తరువాత కొంత విరామం తీసుకుని తన తదుపరి సినిమాను చందు మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ సినిమాను మొదలుపెట్టాడు. తాజాగా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా రేపు శనివారం ప్రారంభం కానుంది. ‘మహానుభావుడు’ మూవీ విజయవంతమైన తరువాత మారుతి చేయబోతున్న సినిమా ఇదే అవ్వడం విశేషం.

ఈ సినిమాలో చైతన్య సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించబోతుందని వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన రాలేదు. సినిమా ముహూర్తం సందర్బంగా ఇతర నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు చిత్ర యూనిట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాకు ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే టైటిల్ ఖరారైనట్లు సమాచారం. శైలజ పాత్రలో రమ్యకృష్ణ నటించబోతున్నారనే వార్తలు వచ్చినా ఆ న్యూస్ లో నిజం లేదని సమాచారం.

 
Like us on Facebook