అక్కినేని హీరో సినిమా మొదలయ్యింది !


నాగ చైతన్య అక్కినేని , దర్శకుడు మారుతి ల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించబోయే సినిమా ఇటీవల ప్రారంభం అయ్యింది. అను ఇమ్మానుల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజే మొదలైంది.

గోపి సుందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా కు ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే టైటిల్ ఖరారు చేసారు. రమ్యకృష్ణ ఈ సినిమాలో నాగ చైతన్య అత్తగా నటిస్తోంది. తన ప్రతి సినిమాలో హీరో పాత్రకు మంచి ప్రాధాన్యం ఇచ్చే మారుతి ఈ సినిమాలో హీరోను ఇగో కలిగిన కుర్రాడి క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు. లవ్ స్టోరీగా తెరకేక్కబోయే ఈ సినిమా చైతు కెరీర్లో మంచి హిట్ చిత్రంగా నిలువబోతోందని మారుతి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.