రెండు సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరో

రెండు సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరో

Published on Jul 9, 2015 10:37 AM IST

Naga_Shaurya
వరుసగా లవ్ ఎంటర్టైనర్స్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో నాగ శౌర్య రీసెంట్ గా ట్రై చేసిన మాస్ ఎంటర్టైనర్ ‘జాదూగాడు’ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సినిమా తర్వాత నాగ శౌర్య రెండు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. అందులో ముందుగా నందిని రెడ్డి డైరెక్షన్ లో చేస్తున్న కళ్యాణ వైభోగమే సినిమా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 80% పైగా షూటింగ్ పూర్తైన ఈ సినిమాని శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర ప్రసాద్ నిర్మిస్తున్నాడు. మాళవిక నాయర్ హీరోయిన్ గా కనిపించననున్న ఈ పర్ఫెక్ట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది కాకుండా నాగ శౌర్య రమేష్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్నా ఈ సినిమా టాకీ పార్ట్ కూడా 70% పూర్తి కావచ్చింది. నాగ శౌర్య ఈ రెండు సినిమాల షూటింగ్ లో కంటిన్యూగా బిజీ గా ఉన్నాడు. కొద్ది రోజులు నందిని రెడ్డి సినిమా కొద్ది రోజులు రమేష్ వర్మ సినిమా అస్సలు గ్యాప్ లేకుండా బిజీబిజీగా ఉన్నాడు. రమేష్ వర్మ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుంటే శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

తాజా వార్తలు