నాగ శౌర్య కొత్త సినిమా వివరాలు !
Published on Feb 18, 2018 12:18 pm IST

ఐరా క్రియేషన్స్ సంస్థలో వచ్చిన చలో సినిమా మంచి విజయం సాధించింది. నాగ శౌర్య హీరోగా నటించిన ఈ సినిమాను వెంకి కుడుముల దర్శకత్వం వహించారు. సాగర్ మహాత్ అందించిన సంగీతం ఈ సినిమాతో పాపులర్ అయ్యింది. అదే బ్యానర్ లో నాగ శౌర్య రెండో సినిమా మొదలుపెట్టబోతున్నాడు. శ్రీనివాస్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.

శ్రీనివాస్ గతంలో కృష్ణవంశి దగ్గర దర్శకత్వ శాకలో పని చెయ్యడం జరిగింది. నర్తనశాల అనే టైటిల్ ఈ సినిమాకు ఖరారు అయినట్లు సమాచారం. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నాగ శౌర్య తాజాగా నటించిన అమ్మమ్మగారిల్లు సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం తరువాత శ్రీనివాస్ సినిమా మొదలు కానుంది.

 
Like us on Facebook