నాగ శౌర్య స్పీడు మాములుగా లేదుగా…!

నాగ శౌర్య స్పీడు మాములుగా లేదుగా…!

Published on Oct 14, 2019 8:21 PM IST

యంగ్ హీరో నాగశౌర్య వరుసగా కొత్త చిత్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్స్ ఒకే చేస్తూ, దూసుకెళుతున్నారు. ఇప్పటికే సొంత నిర్మాణ సంస్థ ఐరా ప్రొడక్షన్స్ బ్యానర్ లో చేసిన మూవీ డబ్బింగ్ నిన్న మొదలుపెట్టారు. మొదటిసారి మెహ్రిన్ నాగ శౌర్యకి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రమణ తెరకెక్కిస్తున్నారు. ఇక కొద్దిరోజుల క్రితం లక్ష్మీ సౌజన్య అనే ఓ కొత్త లేడీ డైరెక్టర్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్ ఈనెలలో మొదలు కానుంది.

కాగా నేడు మరో కొత్త చిత్రానికి నాగ శౌర్య శ్రీకారం చుట్టారు. శ్రీవేంకటేస్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రం పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నాగ శౌర్య పై క్లాప్ కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ మూవీలో ఇతర నటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు