మేలో నాగ శౌర్య కొత్త సినిమా ప్రారంభం !
Published on Feb 27, 2018 3:10 pm IST

ఐరా క్రియేషన్స్ సంస్థలో వచ్చిన మొదటి సినిమా ‘ఛలో’. నాగ శౌర్య హీరోగా నటించిన ఈ సినిమాను వెంకి కుడుముల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తరువాత ఐరా సంస్థ మరో సినిమాకు శ్రీకారం చుట్టబోతోంది. నూతన దర్శకుడు శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో శ్రీనివాస్ వర్క్ చేయడం జరిగింది.

నాగ శౌర్య హీరోగా నటించబోయే ఈ సినిమాకు ‘నర్తనశాల’ అనే టైటిల్ ఖరారు చేసారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా మే నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. ఇకపోతే నాగ శౌర్య నటించిన ‘అమ్మమ్మగారిల్లు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. బేబి షామిలి ఈ సినిమాతో రీ ఎంట్రి ఇవ్వబోతోంది. ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ కు మంచి రెస్పాన్స్ లభించిది.

 
Like us on Facebook