నిహారికతో పెళ్లి రూమర్లను ఖండించిన యువ హీరో !

గత కొన్ని రోజులుగా పరిశ్రమలో వినిపిస్తున్న హాట్ హాట్ వార్తల్లో మెగా డాటర్ నిహారిక పెళ్లి వార్త కూడా ఒకటి. త్వరలో నిహారిక, యువ హీరో నాగ శౌర్య వివాహమని, ఇరు కుటుంబ సభ్యుల నడుమ చర్చలు నడుస్తున్నాయని రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. అంతేగాక ఇటీవల విడుదలకు సిద్ధంగా ఉన్న నాగ శౌర్య చిత్రం ‘ఛలో’ ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ ముఖ్య ఆతిథిగా హాజరవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

ఈ విషయం తాజాగా జరిగిన ‘ఛలో’ చిత్ర ప్రెస్ మీట్లో నాగ శౌర్య వద్ద ప్రస్తావనకు రాగా సౌమ్యంగా స్పందించిన ఆయన ఈమధ్యే తన సన్నిహితులు తనకు ఈ వార్త గురించి చెప్పారని, వాటిలో ఏమాత్రం నిజం లేదని, ప్రస్తుతం తాను సినిమాల్లో బిజీగా ఉన్నానని, ఇంకో మూడు నాలుగేళ్లలో ఇంట్లో వాళ్ళు చూడబోయే అమ్మాయినే వివాహం చేసుకుంటానని క్లారిటీ ఇచ్చారు.