తన సినిమా కోసం నీటిని కూడా పక్కన పెట్టిన నాగశౌర్య.!

Published on Sep 20, 2020 1:03 pm IST

తన మొదటి సినిమా నుంచి ఏదొక కొత్త కాన్సెప్ట్ కానీ లైన్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన యువ హీరో నాగశౌర్య. ఒక మంచి రచయిత అని కూడా తెలిసిందే. అలా తాను ఎంతో ఇష్టపడి రాసుకున్న లాస్ట్ చిత్రం “ఆశ్వథ్థామ” మంచి టాక్ ను సంతరించుకుంది. అయితే ఆ సినిమా కోసం అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మంచి స్టైలిష్ అండ్ మ్యాచో ఫిజిక్ తో కనిపించి ఆశ్చర్యపరిచాడు.

ఇక ఈ చిత్రం తర్వాత నాగశౌర్య నటిస్తున్న 20 వ చిత్రంతో తన లుక్ ను చూపించి షాక్ ఇచ్చాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విలు విద్య బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రానికి నాగ శౌర్య పికప్ చేసిన 8 పలకల దేహం సినీ వర్గాల్లో మంచి హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఆ ఫిజిక్ ను తయారు రోజుల పాటు కనీసం నీటిని కూడా తాగలేదంట.

ఈ లాక్ డౌన్ లో చాలా స్ట్రిక్ట్ డైట్ ను తీసుకోవడమే కాకుండా హార్డ్ జిమ్ చేసాడట. ఇదే కాకుండా ఐదు రోజుల పాటు నీటిని తీసుకోకుండా ఉండడమే కాకుండా కనీసం తన సలైవా(నోటి ద్రవాలను) కూడా మింగే వాడు కాదట. అలా తన 8 ప్యాక్ బాడీను ఈ సినిమాలోని పలు కీలక సన్నివేశాల కోసం తయారు చేసాడట. దీనిని బట్టి నాగశౌర్యకు సినిమా పట్ల ఉన్న ప్యాషన్ ఏ స్థాయిలో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :

More