గ్రాండ్ గా జరిగిన ‘ ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ టీజర్ విడుదల వేడుక

గ్రాండ్ గా జరిగిన ‘ ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ టీజర్ విడుదల వేడుక

Published on Feb 9, 2023 11:25 PM IST


యువ నటుడు నాగశౌర్య హీరోగా మాళవిక నాయర్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిర్మితం అవుతున్న ఈ మూవీకి కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. గత కొన్నాళ్ళుగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంది. ఇక నేడు ఈ మూవీ యొక్క టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కాగా ఈ టీజర్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ వేడుకలో హీరో నాగశౌర్య మాట్లాడుతూ 2013 లో అవసరాల గారిని కలిశాను. ఆయనకిది మూడో సినిమా. ఆయనతో నాకిది మూడో సినిమా. కానీ నాకు మాత్రం ఇది 23వ సినిమా. నాకు చాలా సంతోషంగా ఉంది.

ఆయన ద్వారానే నేను ప్రేక్షకులకు ఇంత దగ్గరయ్యాను. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు ఎలాగైతే గుర్తుండిపోతాయో, ఈ సినిమా కూడా అలాగే గుర్తుండిపోతుంది. ఈ సినిమా మీద నాకు చాలా నమ్మకముంది. ఈ సినిమాని ఆయన తీసినట్లు ఎవరూ తీయలేరు. కొన్ని సినిమాలు విడుదలై విజయం సాధించాక మనకు ఆనందం కలుగుతుంది. కానీ ఈ సినిమా మాత్రం విడుదల కాకముందే నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇలాంటి సినిమా మళ్ళీ నా జీవితంలో చేయలేను. ఇది నేను మనస్ఫూర్తిగా చెబుతున్న మాట. కళ్యాణి మాలిక్ గారిని, ఆయన పాటలను ఎప్పటికీ మరచిపోలేము. నిర్మాతలు విశ్వప్రసాద్ గారికి, దాసరి గారికి, వివేక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మాళవిక నాకు మంచి ఫ్రెండ్. తను చాలా మంచి యాక్టర్. తనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది అన్నారు.

మాళవిక నాయర్ మాట్లాడుతూ టైటిల్ ని బట్టే మీరు ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఊహించవచ్చు. ఇది మీ ప్రేమ కథ అయ్యుండొచ్చు. మీ స్నేహితుల ప్రేమ కథ అయ్యుండొచ్చు. కానీ ఈ సంజయ్, అనుపమల ప్రేమకథ చూడటం ఇంకా ఎక్కువ మజా వస్తుంది. ఎందుకంటే ఇది శ్రీనివాస్ గారి మ్యాజిక్. ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు” అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ ఇది టీమ్ అంతా కలిసి చర్చించుకొని తీసిన సినిమా. సహజత్వానికి దగ్గరగా ఉండేలా తీశాం. సినిమాటిక్ డైలాగ్స్ తో స్క్రిప్ట్ ని రాయకుండా నిజ జీవితంలో వ్యక్తులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో, అలా సహజ సంభాషణలతో తీసిన సినిమా ఇది. మన చుట్టూ ఉండే మనుషుల మధ్య జరిగే కథ లాంటిది. నటీనటులు, టెక్నిషియన్స్ అందరం కలిసి ఒక టీమ్ లా పనిచేశాం” అన్నారు. కాగా ఈ సినిమాని ఉగాది కానుకగా మార్చి 17న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు