ఇంట్రెస్టింగ్ గా అభిషేక్ నామా “నాగబంధం” టైటిల్ గ్లింప్స్!

ఇంట్రెస్టింగ్ గా అభిషేక్ నామా “నాగబంధం” టైటిల్ గ్లింప్స్!

Published on Apr 9, 2024 2:04 PM IST


ఇటీవల ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ తన 9వ సినిమా ను అనౌన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. నేడు ఉగాది పండుగ సందర్భంగా ఈ చిత్రం కి సంబందించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం కి నాగబంధం అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. ది సీక్రెట్ ట్రెజర్ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ వీడియో ను మేకర్స్ రిలీజ్ చేశారు.

వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. నాగబంధం కాన్సెప్ట్ తో సినిమా ఉండనుంది అని, వీడియో ను చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రానికి అభిషేక్ నామా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందిస్తున్నారు. దేవాన్ష్ నామా సమర్పణలో, థండర్ స్టూడియోస్ సహకారంతో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభే ఈ చిత్రం కి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు