రైతుల ఆత్మహత్యల ఆధారంగా ‘నాగలి’
Published on Jun 13, 2017 4:39 pm IST


రైతుల సమస్యలు, ఆత్మహత్యల గురించి రోజూ వార్తల్లోచూస్తూంటాం.ప్రస్తుతం రైతులు అనుభవిస్తున్న కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ అంశంపై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాజేష్ తౌచ్రివెర్. ఈ చిత్రానికి ‘నాగలి’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ లోగోని విడుదల చేశారు.

ఈ చిత్రాన్ని సామాజిక కార్యకర్త అయిన సునీత కృష్ణన్ నిర్మిస్తున్నారు. మన జీవితాలు రైతులతోనే ముడిపడి ఉన్నాయి. అయినా కూడా మనం వారిని గుర్తించడం లేదని సునీత కృష్ణన్ అన్నారు. కాగా ఈ చిత్రానికి శాంతను మొయిత్రా సంగీత దర్శత్వం వహిస్తున్నారు. రాజేష్ తౌచ్రివెర్ దర్శకత్వం వహించిన నా బంగారు తల్లి చిత్రం 2013 లో జాతీయ అవార్డుని సొంతం చేసుకుంది.

 
Like us on Facebook