‘బంగార్రాజు’ సిద్ధం.. చైతుకి జోడీగా క్రేజీ హీరోయిన్ !

‘బంగార్రాజు’ సిద్ధం.. చైతుకి జోడీగా క్రేజీ హీరోయిన్ !

Published on Jul 19, 2021 11:01 AM IST

అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’ సీక్వెల్ ‘బంగార్రాజు’ స్క్రిప్టుని పక్కాగా ముస్తాబు చేశారు. ఆగస్టు 16 నుంచే ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ లో ప్రత్యేకంగా వేసిన ఓ సెట్‌ లో ముందుగా షూట్ స్టార్ట్ కానుంది. మొదటి షెడ్యూల్ లో నాగార్జున, రమ్యకృష్ణలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారట.

ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే చైతుకి జోడీగా క్రేజీ హీరోయిన్ కృతిశెట్టి నటించబోతుంది. ‘మనం’ తర్వాత నాగార్జున – నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. సంక్రాంతికి విడుదల చేయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తారు. ‘సోగ్గాడే… ’ చిత్రంతోనే పరిచయమైన కళ్యాణ్ కృష్ణ ‘బంగార్రాజు’తో మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు