‘బంగార్రాజు’ మార్చిలో స్టార్ట్ అవుతాడా ?

Published on Jan 24, 2020 8:11 am IST

కింగ్ అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా కూడా ఒకటి. ఒకవిధంగా ఈ డికేడ్ లో నాగ్ కెరీర్ లోనే ఈ సినిమా ముఖ్యమైంది. 2015 లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రంలో నాగార్జున చేసిన ‘బంగార్రాజు’ పాత్రకు విశేషమైన స్పందన వచ్చింది. దీంతో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, నాగార్జున – నాగ చైతన్య కలయికలో ఆ సినిమానికి సీక్వెల్ తీయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ చిత్రం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోదరుడు మరణం కారణంగా అలాగే నాగ్ పర్సనల్ పనులతో బిజీగా ఉండటం కారణంగా ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. దాంతో అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేకపోయింది. ఇక మార్చి మూడో వారంలో సినిమాను మొదలుపెట్టి, వ‌చ్చే ఏడాదే వేస‌విలో బంగార్రాజు సినిమాని రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ, ఈ చిత్ర సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్‌తో పాటు సాంగ్స్ కంపోజిషన్స్‌ లో బిజీగా ఉన్నాడట.

ఇక బంగార్రాజు స్క్రిప్ట్ పనులు కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయట. ఇక ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది. మరి నాగ్ ఈ సారి హిట్ కొడతారా చూడలి. అయితే గత సినిమా రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ గా వచ్చిన `మ‌న్మ‌థుడు 2′ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ చిత్రంగా నిలిచింది. దాంతో నాగార్జున తన తరువాత సినిమాల విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

X
More