ఏఎన్ఆర్ అవార్డుల వేదికలో ఎమోషనల్ అయిన నాగ్

Published on Nov 17, 2019 9:30 pm IST

నేడు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిరంజీవి, సుబ్బరామి రెడ్డి, బోనీ కపూర్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన నాగార్జున వారి తండ్రి ఏఎన్ఆర్ గురించి తలచుకొని కొంచెం ఎమోషనల్ అయ్యారు.

”సినిమా నాకు సర్వస్వం. అదే నాకు ఎంతో ఇచ్చింది. ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి ఓ అవార్డు సృష్టించబడింది. సినిమా రంగానికి తమ సేవలతో గౌరవం తెచ్చేవారిని ఏఎన్నార్‌ జాతీయ అవార్డుతో సత్కరించాలనుకున్నాం’ ఇది ఏఎన్నార్‌ జాతీయ అవార్డు గురించి నాన్న మదిలో ఆయన చెప్పిన మాటలు. ఆయన సంకల్పమే ఇవాళ మమ్మల్ని నడిపిస్తోంది. ఆయన ఆలోచనలనే మేం ఆచరిస్తున్నాం. చిత్ర పరిశ్రమలోని గొప్ప వ్యక్తులను సత్కరించి, వారి పేరుతోపాటు నాన్న పేరు కూడా చిరకాలం ఉండేలా ఈ అవార్డు ఇస్తున్నాం. శ్రీదేవి, రేఖకు ఆ గౌరవం దక్కాలని, వారికి ఏఎన్నార్‌ జాతీయ అవార్డు ఇవ్వాలని నాన్న ఎప్పుడూ చెబుతుండే వారు. ఆయన ఉన్నప్పుడు వీరికి ఇవ్వలేకపోయాం. కానీ, తెలుగు సినిమా ఉన్నంత వరకు అక్కినేని నాగేశ్వరరావు ఉంటారు. ఈ వేదికపై ఉన్న ఏఎన్నార్‌ జాతీయ అవార్డుతోపాటు నాన్న ఇక్కడ మనతోనే, మనలోనే ఉన్నారని అనుకుంటున్నా. ఈ అవార్డులతో ఆయన సంకల్పం నెరవేరుతుందని ఆశిస్తున్నా” అని నాగ్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో నాగచైతన్య, అఖిల్‌, అక్కినేని అమల, విజయ్‌దేవర కొండ, మంచులక్ష్మి, నిహారికి, అడవి శేష్‌, రాహుల్‌ రవీంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం :

More