నాగార్జున మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ వాయిదా !
Published on Feb 25, 2018 12:25 pm IST

బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టి తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో సుస్ధిరస్ధానం పొంది తెలుగు హిందీ తమిళ మళయాళ కన్నడ భాషల్లో అగ్ర హీరోయిన్ గా ఎదిగి అనేక ప్రతిష్టాత్మక అవార్డులతో పాటు పద్మశ్రీని సైతం పొందిన సుప్రసిద్ధ సినీనటి, అతిలోక సుందరి శ్రీదేవి మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీవ్ర ద్రిగ్భంతిని కలిగించింది.

ఈరోజు 2 గంటలకు నాగార్జున, రామ్ గోపాల్ వర్మ సినిమా టైటిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యబోతున్నట్లు నిన్న తెలిపారు. కాని శ్రీదేవి ఆకస్మిక మృతి పట్ల టైటిల్ ప్రకటన వాయిదా వేసారు వర్మ. త్వరలో మరో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చెయ్యబోతున్నారు. గతంలో శ్రీదేవి, నాగార్జున ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

 
Like us on Facebook