“వైల్డ్ డాగ్” ట్రైలర్..నాగ్ కు పర్ఫెక్ట్ కంబ్యాక్ లా ఉంది!

Published on Mar 12, 2021 5:00 pm IST

అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “వైల్డ్ డాగ్”. కింగ్ నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రం తాలూకా ట్రైలర్ ను మేకర్స్ లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా విడుదల చేశారు. మరి ఈ ట్రైలర్ విషయానికి వస్తే నాగ్ కు ఇదొక పర్ఫెక్ట్ కం బ్యాక్ ఇచ్చేలా ఉందని చెప్పాలి. నిజ జీవిత బాంబ్ బ్లాస్ట్ లు ఆధారంగా తెరకెక్కిన ఈ దేశ భక్తి సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ మంచి ఇంటెన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.

అంతే కాకుండా ట్రైలర్ లో ప్రతీ షాట్ రియలిస్టిక్ బాంబ్ బ్లాస్టులు సహా యాక్షన్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఏసీపీ విజయ్ వర్మగా నాగ్ రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తన యాక్షన్ ఇవన్నీ చూస్తుంటే “సోగ్గాడే చిన్ని నాయన” తర్వాత మళ్ళీ తాను ట్రాక్ లోకి వచ్చేలా అనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈ ట్రైలర్ లో డైరెక్టర్ అషిహోర్ సాల్మోన్ కు స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి.

మంచి రేసింగ్ స్క్రీన్ ప్లే ఇందులో చూపించేలా ఉన్నారు.డైలాగ్స్ కూడా ఇందులో బా చూపించారు. అలాగే ఈ ట్రైలర్ లో మరో మేజర్ హైలైట్ థమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది ఈ ట్రైలర్ ఖచ్చితంగా బాగా ఉపయోగపడింది అని చెప్పాలి. అలాగే షనైల్ డియో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మొత్తానికి మాత్రం ఈ ఏప్రిల్ 2న విడుదల కాబోయే సినిమాపై ఈ ట్రైలర్ మంచి ఆసక్తిని రేకెత్తించింది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :