ఏ వయసులోనైనా ప్రేమించవచ్చు అని చెప్పే సినిమా ఇది – నాగార్జున

Published on Aug 5, 2019 9:46 am IST

రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ గా రాబోతున్న రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ మ‌న్మ‌థుడు 2. కాగా ఆదివారం రాత్రి ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ‘ఆగష్టు నెల నాకెంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ నెలలోనే బిగ్‌బాస్ 3 మొదలైంది. ఇప్పుడు మన్మథుడు 2 రిలీజ్ కాబోతుంది. నాకు ఇద్దరు కొడుకులున్నారని అంటున్నారు. కానీ వారు నాకు సోదరులు. ఈ నెలాఖరుకి నాకు నటుడిగా 30 ఏళ్లు పూర్తవుతాయి. ఇప్పుడు నేను లవ్ స్టోరీ చేయడమేంటని చాలా మంది అంటున్నారు. కానీ ఏ వయసులోనైనా ప్రేమించవచ్చు అని చెప్పే సినిమా ఇది. అందరూ ఆకట్టుకునేలా మన్మథుడు 2 ఉంటుంది అన్నారు.

కాగా ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో నాగార్జున క్యారెక్టర్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ గా ఉంటుందని.. సినిమా మొత్తంలో నాగ్ కామెడీనే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :